Cotton Crop | తొగుట, జూలై 26 : వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీటిని బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఏవో మోహన్ అన్నారు. ఏవో మోహన్ తొగుట మండలం బండారు పల్లి గ్రామంలో పత్తి పంటను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏవో మోహన్ మాట్లాడుతూ.. వరికి మోగి పురుగు నివారణకు నారుమడిలో ఒక కేజీ కార్బో ఫు రాన్ గుళికలు వాడాలని సూచించారు.
బండారుపల్లి గ్రామంలో పత్తి పంటను సందర్శించి.. అధిక వర్షాల నేపథ్యంలో రైతు సోదరులకు పంట కాపాడుకోవడానికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న పంటలో అధికంగా నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా చిన్న కాల్వలు ఏర్పరచుకోవాలన్నారు. పత్తి పంటలో వేరు ప్రాంతంలో నల్లగా మారినచో 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందు వేరు మొదళ్లలో పడే విధంగా వర్షాలు తగ్గుముఖం పట్టాక పిచికారీ చేయాలన్నారు.
పంటకు అధిక బలం చేకూరడానికి ఎకరాకు 25 కేజీ యూరియా లేదా నానో యూరియా లీ నీటికి 2.5మి లీ మరియు 15 కేజీ పొటాష్ వర్షాలు తగ్గు ముఖం పట్టాక వాడుకోవాలి లేదా 19:19:19 అనే ఫర్టిలైజర్ 1 లీటర్ నీటికి 10గ్రాముల వర్షాలు తగ్గు ముఖం పట్టాక పిచికారీ చేయాలి. వరి పంటలో మొగి పురుగు ఉధృతి అరికట్టడానికి ఎకరా నారుమడిలో 1 కేజీ కార్బొఫురన్ గులికలు వాడాలి. ప్రధాన పొలంలో అయితే ఎకరాకు 10 కేజీలు వర్షాలు తగ్గు ముఖం పట్టాక వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మోహన్ , విస్తరణ అధికారి నాగార్జున్, రైతు చెప్యాల రాజు పాల్గొన్నారు.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన