గజ్వేల్, జూలై 26: గజ్వేల్ (Gajwel) పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని పలు ఇళ్లలో అర్ధరాత్రి చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇండ్లను ఎంచుకున్న దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని కోర్టు సమీపంలో, పిడిచేడ్ మార్గంలో, రాజీవ్ పార్కు వద్ద పలు ఇండ్లలో విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. ఇండ్లలో వస్తువులను చిందరవందరగా పడేశారు. తెల్లవారుజామున గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీమ్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.