హైదరాబాద్ : కృష్ణా ( Krishna) , గోదావరి ( Godavari ) జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ( MLA Harish Rao) అన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ( BRSLP ) కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఆంధ్రాకు దాసోహమై తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. గోదావరి, బనకచర్లపై ఢిల్లీ మీటింగ్ మినిట్స్ వచ్చి నెల దాటినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొద్దు నిద్ర వీడి నీటి హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
లేఖల డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం – నల్లమలసాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో పేర్కొంటే, దీనికి దీటుగా సమాధానం చెప్పాల్సిన తెలంగాణ ప్రభుత్వం కనీసం పోలవరం – నల్లమలసాగర్ను అడ్డుకుంటాం, కృష్ణా – గోదావరిలో చుక్క నీరు కూడా వదులుకోమని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.