‘అధిక దిగుబడులకు భూసార పరీక్షలు తప్పనిసరి’
రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకుని విత్తనాలు వేసుకోవాలని గడ్డిపల్లి కెవికే వ్యవసాయ శాస్త్రవేత్తలు సురేష్. వి.కిరణ్ సూచించారు. సోమవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురంలో చైతన్య డీమ్డ్-టు-బి యూనివర్సిటీ అగ్రికల్చర్ విద్యార్థులతో..
పెన్‌పహాడ్, ఆగస్టు 03 : రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకుని విత్తనాలు వేసుకోవాలని గడ్డిపల్లి కెవికే వ్యవసాయ శాస్త్రవేత్తలు సురేష్. వి.కిరణ్ సూచించారు. సోమవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురంలో చైతన్య డీమ్డ్-టు-బి యూనివర్సిటీ అగ్రికల్చర్ విద్యార్థులతో కలిసి రైతులకు భూసార నమూనా ఎలా సేకరించాలి అని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకుని పంటలు వేసుకోవాలన్నారు. ఏ పంట సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందో, పంటలకు సరైన మోతాదులో ఎరువులు వేసేందుకు భూసార ఫలితాలు మేలు చేస్తాయని తెలిపారు. పంటలు సాగు చేసేందుకు రైతులు సేంద్రీయ ఎరువులు వినియోగించాలన్నారు.
భూసార పరీక్షకు ఎంపిక చేసే విధానం
రైతులు మట్టి పరీక్ష కోసం ఒకే రకమైన పొలం అయితే ప్రతి 5 ఎకరాలకు ఒక నమూనా మట్టి సేకరించాలి. ఐదు ఎకరాలకు మించి నేల రకం ఉంటే 2 నమూనాలు సేకరించాలి. 15 ఎకరాలకు 3 నమూనాలు తీయాలి. నేల వాలు, నేల రకం మార్పులు, ఉంటే 15 సెంట్లకు ఒక నమూనా సేకరించాలి. మట్టి సేకరించే ముందు పొలాన్ని యూనిట్లుగా విభజించాలి. పొలం వాలును బట్టి నేల రకాన్ని బట్టి ఇసుక నేల, గరక నేల, నల్ల రేగడి, ఒండ్రు భూమి, వంటి రకాన్ని పంట సాగు నకు కృషి చేస్తాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, విద్యార్థులు భవాని, మానస, దివ్య శ్రీ, దీపికా, హస్మిత, కావేరి, స్రనవిత, రైతులు బెల్లంకొండ అంజయ్య, ఉప్పల రాంరెడ్డి, శేఖర్ రెడ్డి, విబికె నాగమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

