Mandula Samuel | మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే మందుల సామ్యూల్ ఇంటిపై బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. హిందువులను కించపరిచే విధంగా మందుల సామ్యూల్ వ్యాఖ్యలు చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఈ చర్యకు దిగినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఆలయాల వద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని, ప్రజల వద్ద ఓట్లు కోరిన సామ్యూల్ ఇప్పుడు హిందువులను అవమానించే విధంగా మాట్లాడడం సరైంది కాదని మండిపడ్డారు.
మందుల సామ్యూల్ తన వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా హిందువులకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఘటనతో బోడుప్పల్ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొనగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Chinmayi | వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు
Akshay Kumar | తండ్రిని కోల్పోయిన బాధని గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. పురుషులకు కీలక సూచన