– ఉద్యోగ భద్రత కల్పించాలి
– టీజీ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి
కోదాడ, మార్చి 16 : కేజీబీవీ, సమగ్ర శిక్ష, యూఆర్ఎస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస బేసిక్ పే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమ్మె కాలపు 29 రోజుల వేతనాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 20న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. సిఐటియు నాయకులు ముత్యాలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మండల బాధ్యులు శ్రీరంగరాజు, విక్రమ్ రెడ్డి, ఆంజనేయులు, నరసింహారావు, గోపయ్య, సక్రు, బాలరాజు, సీనియర్ కార్యకర్తలు ఎం.శ్రీనివాసరావు, ఏ.బచ్చయ్య, సమగ్ర శిక్ష ఉద్యోగులు శ్రీను, ప్రమీల, హైమావతి, వెంకటరమణ, సుజాత, సీతారాం, సురేశ్, కేజీబీవి ఉపాధ్యాయులు ఆసియా, జ్ఞాన మంజరి, నాగేంద్ర, పిటిఐ ఉపాధ్యాయులు మీర్జా, నాగేశ్వరరావు, అర్వపల్లి పాల్గొన్నారు.