Harish Rao | కేసీఆర్ పోరాటం జయశంకర్ సారు ఆరాటం వల్లే తెలంగాణ వచ్చింది : హరీశ్ రావు
Harish Rao | Harish Rao | ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఈరోజు తెలంగాణ సీఎంగా ఉన్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. .
Harish Rao | సిద్దిపేట ప్రాంతంతో ప్రొఫెసర్ జయశంకర్‌కు ఎంతో అనుబంధం ఉండేది… తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ పోరాటం జయశంకర్ సారు ఆరాటం వల్ల వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆయన విగ్రహానికి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఈరోజు తెలంగాణ సీఎంగా ఉన్నాడు. గోదావరిలో 380 TMC ల నీళ్లు కేసీఆర్ నాయకత్వంలో హక్కుగా సాధించాం. 968 TMC గోదావరి నదీ జలాలలో మన హక్కుగా రావలసింది అని పోరాటం చేశారు. కేసీఆర్ గోదావరిలో 830 TMC నీళ్లు హక్కుగా సాధించారు. కేసీఆర్ మిగతా 130 TMC ల నీళ్ల కోసం DPR లు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 సంవత్సరాలు అయినా ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదన్నారు.
GRMB చరిత్రలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలని రివ్యూ చేయాలని మొదటిసారి వచ్చింది. గతంలో 18 వరకు GRMB మీటింగులు అయ్యాయి GRMB ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టుల పునర్ సమీక్షించాలని తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని ఎప్పుడూ రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడు వ్యతిరేకించినా తెలంగాణ దాన్ని తిప్పి కొట్టింది.. అన్ని అనుమతులు సాధించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఎజెండాలోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టుల మీద నీళ్ల మీద సోయి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి GRMB ఎజెండా మార్పించాలని హరీశ్ రావు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే GRMB మీటింగ్ ను బహిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న బనకచర్లను ఎందుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోలేక పోతుంది.
సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ 47 TMC హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చాక తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వదులుకుంటుంది అనేది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.SRSP స్టేజ్ 2కు సమ్మక్క సారక్క నీళ్లు అవసరం. వరంగల్ నల్గొండ ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును ఎందుకు వదులుకుంటున్నారని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కట్టే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆనాడు ఎజెండాలో లేదన్నారు..ఢిల్లీలో జరిగే మీటింగ్ లో ఉంది..మీటింగుకు హాజరు కాము అన్నారు…హాజరయ్యారు.. సంతకం పెట్టా అన్నారు సీఎం..కోర్టులో కేసులు వేసి అట్టర్ ప్లాప్ అయ్యారు.. కోర్టులో రిట్ కేస్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యడానికి రావడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు.
Read Also :
Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..
Footballer | మ్యాచ్ ఆడుతుండగా ఫుట్‌బాలర్‌పై పిడుగు.. అక్కడికక్కడే దుర్మరణం..!
Pradeep Rawat | చివరి క్షణాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమైన ప్రదీప్ రావత్ కుమారుడు.. అంతా నెలన్నరలోనే జరిగిపోయింది..
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

