పప్పీకి పోషకాహారం
పౌష్టికాహారం మనుషులకే కాదు జంతువులకూ అవసరమే. మనుషుల్లో ఉండే రకరకాల ఫుడ్ ఎలర్జీలు జంతువుల్లోనూ ఉంటాయి. అందువల్ల పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటికి సరిపోయే ఆహారంతోపాటు వాటికి కావలసిన పోషక విలువలు అందించే కొన్ని రకాల సూపర్
పౌష్టికాహారం మనుషులకే కాదు జంతువులకూ అవసరమే. మనుషుల్లో ఉండే రకరకాల ఫుడ్ ఎలర్జీలు జంతువుల్లోనూ ఉంటాయి. అందువల్ల పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటికి సరిపోయే ఆహారంతోపాటు వాటికి కావలసిన పోషక విలువలు అందించే కొన్ని రకాల సూపర్
ఫుడ్స్ ఇవి..
బ్లూబెర్రీస్: వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయి.
క్యారెట్స్: రోగనిరోధక శక్తిని పెంచే బీటాకెరోటిన్ పుష్కలంగా లభించే ఆహారం క్యారెట్. ఇది జంతువుల ఫర్(ఊలు) ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కంటి సమస్యలనూ తగ్గిస్తుంది. పచ్చి క్యారెట్లను నమలడం వల్ల వాటి చిగుళ్లు గట్టిపడతాయి.
చియాసీడ్స్: చియా గింజలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదపడతాయి. వీటిలోని ఐరన్, విటమిన్ బి, పీచు పదార్థాలు, ప్రొటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అరగంటపాటు నీళ్లల్లో నానబెట్టిన చియా గింజలను పెంపుడు జంతువుల ఆహారంలో కలిపి ఇవ్వొచ్చు.
ఆకుకూరలు: ఆకుకూరలు ఎక్కువగా తినే కుక్కల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అని అధ్యయనాల్లో తేలింది. కాలే, పాలకూర వంటి వాటిని రోజూవారీ ఆహారంతోపాటు అందించాలి. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ప్రొటీన్స్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్లు జంతువుల పూర్తి ఆరోగ్యానికి దోహదపడతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

