తుంగతుర్తి, మార్చి 16 : ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజలు, విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ఫోన్లో వచ్చే సందేశాలు, ఇతర వివరాలను అనుమానితులకు చెప్పొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ ప్రసన్నకుమార్, సీఐ నరసింహారావు, ఎస్ఐ క్రాంతి కుమార్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రమ్య పాల్గొన్నారు.
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో గల పల్లె దావాఖానను ఎస్పీ పరిశీలించారు. డాక్టర్, సిబ్బందితో మాట్లాడి వసతులను తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ దావాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ నరసింహ