హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): పోలీస్స్టేషన్లలో పనిచేసే స్వీపర్లు, అటెండర్లు, సావెంజర్లకు కనీస వేతనాలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. కనీస వేతనాల చట్టం ప్రకారం కలెక్టర్ ప్రకటించిన వేతనాలను అమలుచేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేరొన్నది. నల్లగొండ జిల్లాకు చెంది న ఉప్పల మల్లికార్జునతోపాటు మరో 48 మంది దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీహెచ్ గణేశ్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.