Asia Cup 2026 : మహిళల ఆసియా కప్‌ను ఎనిమిదోసారి ముద్దాడింది భారత జట్టు. అజేయంగా ఫైనల్ చేరిన టీమిండియా ఏకపక్ష పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా గత సీజన్లో ఎదురై ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మెరుపు బ్యాటింగ్‌తో లంక బౌలర్లను హడలెత్తించిన ఓపెనర్లు షఫాలీ వర్మ(68), స్మృతి మంధాన(59) అర్ధ శతకాలతో భారీ స్కోరందించగా.. ఆపై శ్రీచరణి(4-20) తిప్పేసింది. బంతితోనూ షఫాలీ ఓ చేయి వేయగా వరసగా రెండో టైటిల్ సాధించాలనుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ కల చెదిరింది.
నిరుడు స్వదేశంలో వన్డే ప్రపంచకప్ విజేతగా చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఆసియా కప్‌ను ఒడిసిపట్టింది. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించిన భారత్ తమకు తిరుగులేదని చాటింది. 184 పరుగుల ఛేదను డిఫెండింగ్ ఛాంపియన్‌ను 110 పరుగులకే పరిమితం చేసిన ఇండియా 72 రన్స్ తేడాతో గెలిచింది. రెండేళ్ల క్రితం టైటిల్ పోరులో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
భారీ ఛేదనలో శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాకిస్తూ ఓపెనర్ దులానీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసింది క్రాంతి. ఆపై క్రాంతి, నందినిలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక కెప్టెన్ చమరి ఆటపట్టు(36), విష్మీ గుణరత్నే(30)లు తడబడ్డారు. పవర్ ప్లేలో లంక 31 రన్స్ చేసిందంతే. కాస్త కుదురుకున్నాక భారీ షాట్లతో భయపెట్టిన ఆటపట్టును దీప్తి శర్మ బోల్తా కొట్టించింది.
#TeamIndia inching closer to victory 🔢
Shafali Verma 🤝 Sree Charani with the wickets 🙌
Updates ▶️ https://t.co/knKLXGSfOd #WomensAsiaCup | #INDvSL pic.twitter.com/zNEldRhcbD
— BCCI Women (@BCCIWomen) September 13, 2026
దీప్తి సంధించిన బంతిని ఆడేందుకు క్రీజును వదిలిని లంక కెప్టెన్ అంచనా తప్పింది. అంతే.. బంతిని అందుకున్న రీచా ఘోష్ రెప్పపాటులో స్టంపింగ్ చేసింది. అదే ఓవర్లో గుణరత్నేసైతం బౌల్డవ్వగా లంక మూడో వికెట్ కోల్పోయింది. అక్కడ నుంచి లంక స్కోర్ వేగం తగ్గింది. నీలాక్షిక సిల్వ(22) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా.. శ్రీ చరణి(4-20) ఒకే ఓవర్లో రెండు వికెట్లతో లంక ఆశలపై నీళ్లు చల్లింది. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను అందుకుంది టీమిండియా.
ఫైనల్లో భారత ఓపెనర్లు చితక్కొట్టారు. ఎనిమిదో టైటిల్ లక్ష్యంగా టీమిండియాకు శుభారంభమిస్తూ.. ఇన్నింగ్స్ మొదటి బంతినే స్మృతి మంధాన(59) బౌండరీకి తరలించగా.. ఆ తర్వాత కవిశ దిల్హరి ఓవర్లో షఫాలీ వర్మ(68) రెండు ఫోర్లతో చెలరేగింది. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలోనే వికెట్ పడకుండా టీమిండియా 57 పరుగులు చేసింది. కాసేపటికే కవిశ ఓవర్లో బౌండరీతో అర్ధశతకం అందుకుంది షఫాలీ. 24 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో టీ20ల్లో 21వ ఫిఫ్టీ సాధించింది తను.
లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన ఈ జోడీ 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
షఫాలీ వర్మ(68), మంధాన(59)

ప్రబోధ ఓవర్లో షఫాలి వెనుదిరిగాక.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(14)తో సమన్వయం లోపంతో మంధాన రనౌటైంది. అనంతరం హర్మన్‌ప్రీత్ జతగా రీచా ఘోష్(17) ఉతికేసింది. ఓవర్లో 6, 4 తో రెచ్చిపోయింది రీచా. అఇయతే. ధాటిగా ఆడే క్రమంలో ఇద్దరూ త్వరగా ఔటయ్యారు. ఆఖర్లో కమలిని(15 నాటౌట్), భారతి పుల్మాలి(2)లు రాణించగా.. 20వ ఓవర్లో 16 రన్స్ వచ్చాయి. ఫలితంగా వెంటవెంటనే ముగ్గురు ఔటైనా టీమిండియా 5 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.