బెంగళూరు అక్టోబర్ 2: సీఈవో కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించి కోర్టు ఉత్తర్వును ఉల్లంఘించిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన మంత్రివర్గ సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శుక్రవారం బెంగళూరు పోలీసు కమిషనర్ కార్యాలయం వెలుపల బైఠాయించి ధర్నా చేసింది.
అయితే ఈ ఆరోపణను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోసిపుచ్చుతూ తాను ఎన్నికల కమిషన్‌కు ఒక వినతిపత్రాన్ని మాత్రమే సమర్పించానని చెప్పారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అశోక, ఇతర నాయకులు నగర పోలీసు కమిషనర్‌ను కలుసుకుని ముఖ్యమంత్రి, ఇతర మత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) సందర్భంగా ఫారమ్-7ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి తన క్యాబినెట్ సహచరులతో కలసి గురువారం సీఈవో కార్యాలయం బయట నిరసన నిర్వహించినట్టు బీజేపీ ఆరోపించింది.