రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన.. ఇక చాలు
‘రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన. ఇక నాకు చాలు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ సత్యంతో కలిసి ఆయన హాజరై మాట్లాడుతూ.. తన కు పదిసార్లు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ లేదన్నారు.
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు
- మంత్రి పదవి రావడం లేదనే అసహనంతో మాట్లాడినట్టు చర్చ
చండూరు, ఆగస్టు 7: ‘రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన. ఇక నాకు చాలు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ సత్యంతో కలిసి ఆయన హాజరై మాట్లాడుతూ.. తన కు పదిసార్లు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ లేదన్నారు. రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఇక చాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే అధికారులపైనా ఆయన విరుచుకుపడ్డారు. చండూ రు మండలంలో పనిచేసే అధికారులు ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారో తన వద్ద చిట్టా ఉన్నదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపేక్షించబోనని సదరు అధికారులను రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఇదిలావుంటే మంత్రి పదవి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా రావడం లేదనే అసంతప్తి, ఆవేదనతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని స్థానికంగా చర్చ సాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

