నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు పడి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతంలో నడిరోడ్డుపై గుంతలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
రాయపోల్, జూలై 26: సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై గుంతలు పడి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతంలో నడిరోడ్డుపై గుంతలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక శివాజీ చౌరస్తా వద్ద గత కొన్ని గత సంవత్సరం నుంచి గుంతలు ఏర్పడినప్పటికీ అటువైపు వెళుతున్న అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు గుంతలు పూడ్చివేయాలని వేడుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. అంబేద్కర్ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. వర్షాలు కురిస్తే రోడ్డుపై వెళ్లాలంటే వాహనాదారులకు ఇబ్బందిగా మారింది. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎటు చూసినా రోడ్డుపై గుంతలు ఉన్నాయని ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి గొంతులు పూడ్చివేసి చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ మండల కేంద్ర వాసులు కోరుతున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

