మోత్కూరు, జూలై 26 : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మోత్కూరు – రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును పూర్తి చేయాలని బీఆర్ఎస్ మోత్కూరు పట్టణ కమిటీ అధ్వర్యంలో రహదారిపై వరి నాట్లు వేసి, రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు జంగ శ్రీను, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.5.80 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదే రోడ్డును స్థానిక ఎమ్మెల్యే మరలా శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
శంకుస్థాపన చేసి 18 నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం అతి,గతి లేకుండా పోయిందన్నారు. నిత్యం వందలాది వాహనాలు అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై ప్రయాంచాల్సి వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రోడ్డును తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రం చేయనున్నట్లు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, సీనియర్ నాయకులు మంచె గోవర్ధన్, పురుగుల మల్లయ్య, యువజన నాయకులు కూరెళ్ల పరమేశ్, మొరిగల శ్రీను, చొల్లేటి నరేశ్, పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జిట్ట సాయికుమార్, నాయకులు నకిరేకంటి శ్రీను, అన్నందాసు విద్యాసాగర్, అమరేందర్, చేతరాశి వెంకన్న, కూరెళ్ల రమేశ్, బందేల శ్రీను, ఎండీ.యూసఫ్, అన్నందాసు మచ్చగిరి, కడియం స్వామి, భాషబోయిన భిక్షం, వీరారెడ్డి పాల్గొన్నారు.
Motkur : మోత్కూరు – రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన