Elections | రాయపోల్, డిసెంబర్ 04 : రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రవర్తించాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్థానిక జీఎల్ఆర్ గార్డెన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
రాయపోల్ ప్రజలు చాలా మంచి వారని, ఏవిధమైన కేసులలో ఇరుక్కోకుండా ఎన్నికలలో పోటీ చేయాలని, అనుమతి లేకుండా సభలు సమావేశాలు నిర్వహించ రాదని తొగుట సీఐ లతీఫ్ తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్ఐ మానస, సహాయ ఎన్నికల ఖర్చుల పరిశీలకులు శ్రీవల్లి, మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?