Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగానికి సంబంధించి కొన్నిరోజులుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైనట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ.. తమ సినిమాలైన ‘డ్యూడ్’ (Dude) మరియు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రాలలో ఇళయరాజా (Ilayaraja) పాటలను ఉపయోగించినందుకు గాను, ఆయనకు రూ.50 లక్షలు చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ చెల్లింపుతో ఆయా సినిమాల్లో ఇళయరాజా సంగీతాన్ని ఉపయోగించడానికి మైత్రీ మూవీస్ సంస్థకు అధికారిక హక్కులు లభించినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.