Road Accidents | రాయపోల్, ఏప్రిల్ 14 : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎస్ఐ మానస సూచించారు. మంగళవారం మండల కేంద్రం రాయపోల్‌లో నిర్వహించిన డా .బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్‌లను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత వేగం నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్‌ను వినియోగించుకోవాలని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపకూడదని అన్నారు. ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాసాన్ పల్లి రాజు, ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తప్పెట సుధాకర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రవి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్ర నర్సింలు,. మండల ఉపాధ్యక్షుడు బందారం సంతోష్, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం,పోలీసు సిబ్బంది, స్థానికులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
Ambedkar Jayanti | తెలంగాణభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు.. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్