Kalyana Lakshmi | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచేందుకు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని.. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు, కుట్రలను అడ్డుకునేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారని తెలిసిందే.
ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. కల్యాణలక్ష్మి అంశంలో తప్పు అధికారులదా లేక న్యాయ విభాగానిదా అనే అంశంపై విచారణ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కల్యాణ లక్ష్మి విషయంలో నాలుగైదు సార్లు అవకాశం ఇచ్చినా కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్పా, అధికారుల తప్పా తెలిసిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
హైకోర్టును సాకుగా చూపుతూ లక్షలాది నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించకుండా ఈ పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఎత్తివేస్తున్నదని బీఆర్ ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని తెలిసిందే.
కల్యాణలక్ష్మి అంశంలో తప్పు అధికారులదా లేక న్యాయ విభాగానిదా అనే అంశంపై విచారణ చేస్తున్నాము
తప్పు ఎవరిదో తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటాము
– మంత్రి పొన్నం ప్రభాకర్ https://t.co/urIq9p5LSK pic.twitter.com/7ZoSXB5J7x
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026