KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్
KTR | ఎన్నికల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బడుగు, బలహీన వర్గాల ప్రజలను వంచించిందని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతివనంలో జరిగిన జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొని నివాళులు అర్పించారు.
హైదరాబాద్ : ఎన్నికల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బడుగు, బలహీన వర్గాల ప్రజలను వంచించిందని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతివనంలో జరిగిన జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు తీరుపైన, ఆ సర్కారు ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన తీరుపైన ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రతి దళిత, గిరిజన సోదరసోదరీమణులకు తెలియజేయాలని, అందరం కలిసి కాంగ్రెస్ సర్కారు మోసాన్ని ఎండగడుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీలకు 16 శాతంగా ఉన్న రిజర్వేషన్ను 18 శాతానికి పెంచుతామని, ఎస్టీలకు 10 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అన్ని వర్గాలకు రూ.5 లక్షలు ఇస్తే.. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రూ.6 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితబంధు, రైతుబంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి పథకాలను తీసుకురావడం అందరికీ సాధ్యం కాదని, కేసీఆర్ లాంటి ఖలేజా ఉన్న నాయకులకే సాధ్యమని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

