Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
NTR Neel | జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
Alia Bhatt | జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక శక్తివంతమైన కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంలో తారక్, ఆలియా కలిసి నటించి మెప్పించగా, మరోసారి ఈ జంట వెండితెరపై కనిపించబోతుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ సినిమాలో ఆలియా భట్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుండగా, ఆలియా కూడా చేరితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఆలియాను సంప్రదించారని, దానికి ఆమె సానుకూలంగా స్పందించారని టాక్ నడుస్తోంది, అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ‘కలరిపయట్టు’ వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్‌కు ఆలియా వంటి టాలెంటెడ్ నటి తోడైతే, ఈ పాన్-ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

