MLA Palla Rajeshwar Reddy | సిద్దిపేట జిల్లా : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలి. 2023 ఎన్నికల సందర్భం లొ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని రకాల వడ్లకు రూ.500/- రూపాయల బోనస్ చెల్లించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కొమురవెల్లి, అయినాపూర్, కిష్టంపేట, గ్రామాలలొ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను గ్రామాల్లో పర్యటిస్తున్న క్రమంలో రైతులు తనను కలిసి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అందిస్తున్నారని రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అధికారులతో సమీక్షించి ఆనాడే దాదాపు 7500 వడ్ల కొనుగోలు కేంద్రాలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభం చేశారని అన్నారు. ఈ రోజు కూడా 7500 కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు.
అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. దొడ్డువడ్లకు కూడా ఇస్తామని చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చాక కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం హామీలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలొ పెట్టిన విధంగా హామీలపై ప్రమాణం చేసిన ప్రకారం హామీలు అన్ని నెరవేర్చాలని అన్నారు. గతంలో సన్న వడ్లకు ప్రకటించిన బోనస్ కూడా బకాయిలు ఉన్నట్లు తెలిసిందని.. అవి కూడా వెంటనే మంజూరు చేయాలని కోరారు. రైతులందరికీ అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని అన్నారు
2015 తర్వాత మన రాష్ట్రంలో ఆనాడు 14వ స్థానంలో ఉండే సాగు విస్తీర్ణాన్ని రెండవ స్థానానికి కేసీఆర్ గారు తీసుకురాగలిగారు ఉత్పాత కథ 15వ స్థానంలో ఉంటే అది కూడా రెండవ స్థానానికి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ రెండు కలిపి ఉత్పత్తి చూసినట్టయితే భారత దేశంలోనే తెలంగాణ వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. దీనికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆరే అని తెలిపారు. అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నీరు వృధాగా..
తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీరు ఆలస్యంగా వస్తుందని.. వచ్చిన నీరు కూడా వృధాగా వెళ్లిపోతున్నాయని యాజమాన్య పద్ధతులలో అధికారులు వైఫల్యం చెందుతున్నారని విమర్శించారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా నీటిని వృధాగా లీకేజీ ద్వారా పోనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కాబట్టే నీరు వృధాగా పోతుందని అవసరం ఉన్నప్పుడు నీరు దొరకదని అన్నారు.
ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తున్నానని.. రైతులకు సన్నవడ్లతోపాటు దొడ్డువడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలని తపాస్పల్లి రిజర్వాయర్లో నీటిని స్టోరేజ్ చేసి యాసంగి పంటకు రైతులకు నీరు అందించే విధంగా చూడాలని కోరారు. రైతులకు డబ్బులు వచ్చాక రైస్ మిల్లులకు వెంటనే కనెక్ట్ చేయాలన్నారు. ఐఏపీ కావచ్చు పీఏసీఎస్ కావచ్చు.. అది కనెక్ట్ చేసి ఎలాంటి దోపిడీ లేకుండా రైస్ మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా ఇక్కడ ఉండే అధికారులు దానిపై నిఘా పెట్టాలని ఆయన అధికారులను కోరారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్