నార్నూర్, అక్టోబర్ 12 : మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని నార్నూర్ ఎస్ఐ అఖిల్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేయాలన్నారు.
పరిమితికి మించి వాహనాలు నడుపవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్య కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.