Bihar Election : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) పార్టీల్లో సీట్ల కేటాయింపుపై ముమ్మర కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kumar) కు చెందిన జేడీయూ (JDU) లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
బీహార్లోని మొత్తం 243 స్థానాల్లో 103 స్థానాల్లో జేడీయూ పోటీచేసే అవకాశం ఉంది. దాదాపు అన్ని స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అన్ని స్థానాలను మళ్లీ సిట్టింగులకే కట్టబెట్టినా ఓ నాలుగు స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. వారి పేర్లను మాత్రం పార్టీ ఇంకా వెల్లడించలేదు.
జేడీయూ పోటీ చేయనున్న స్థానాలను ఇప్పటికే గుర్తించామని, ఆయా స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశామని జేడీయూకు చెందిన సీనియర్ నేత తెలిపారు. భాగల్పుర్, నవాదా, బంకా జిల్లాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించుతున్నట్లు ఆయన చెప్పారు. కొత్త అభ్యర్థులను బరిలో దించే నాలుగుస్థానాలకుగాను రెండు స్థానాల్లోని జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీలు మారారని వెల్లడించారు.