Farmer | కాంగ్రెస్ సర్కార్ పాలనలో పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలకుర్తికి సరిపడా నీళ్లొచ్చేవని. కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టుబడికి డబ్బులు ఇచ్చేది.. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని పాలకుర్తికి చెందిన ఓ బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
కేసీఆర్ ఉన్నప్పుడే బతికినం.. ఇంటింటికి నల్లా, ఇంటింటికి రోడ్డు.. ఆరు నెలలు కాకముందు రైతు బంధు వేసిండు. రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఒక్క నెల కూడా రాలేదు. నిరుటి నుంచి మేమే అన్నీ చేసుకుంటున్నం. 20 వేలు అప్పులు తెచ్చి యూరియా వేసినం. ఒక మనిషికి 700 కూలీ, 7 వేలకు ఎకరం.. నిరుటి నుంచి అట్లనే యేపించుకుంటున్నం. మాకు తిండికి లేవు.
రేవంత్ రెడ్డి గెలిస్తే నీళ్లు బాగొస్తయి.. పెన్షన్ బాగోస్తది.. రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తదని చెప్పారు. ఏం లేదు సార్ మాకు అంటూ వాపోయింది. మళ్లీ ఓటెస్తరా ఓటు అని అడిగితే.. ఎందుకు మేం ఆయనకు ఓటేయ్యం. ఏం వెయ్యం. మళ్లీ కేసీఆర్నే గెలిపిస్తం. ఎన్నడూ లేదు. కేసీఆర్ ఆర్నెళ్లు కాకముందే రైతు బంధు వేసేవారు. కాంగ్రెస్ వచ్చినంక ఒక్క రూపాయి కూడా పడలేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఓట్లడిగితే చీపురు పట్టుకుంటమంటూ హెచ్చరించింది.
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుల పాలు అయ్యాము
పాలకుర్తిలో నీళ్లు లేక ఎండిపోయిన పొలాలు
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా బ్రతికాము
6 నెలలు కాకముందే కేసీఆర్ రైతు బంధు వేసేవాడు.. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వెయ్యలేదు
రేవంత్ రెడ్డి వచ్చి ఇంకోసారి ఓటు అడిగితే చీపిరి… https://t.co/EZrJnlVbu1 pic.twitter.com/TbPlUFkm4i
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026