Bomb Threats: వేల సంఖ్యలో బాంబు బెదిరింపులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Bomb Threats: దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, కోర్టులకు వేల సంఖ్యలో నకిలీ బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సుమారు 1100 సార్లు బాంబు బెదిరింపులకు పాల్పడిన శ్రీనివాస్ లూయిస్ అనే వ్యక్తిని మైసూరులో అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, కోర్టులకు వేల సంఖ్యలో బాంబు బెదిరింపులు(Bomb Threats) వచ్చిన విషయం తెలిసిందే. సుమారు 1100 సార్లు నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నాటకలోని మైసూరులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల శ్రీనివాస్ లూయిస్‌గా గుర్తించారు. కిరాయి ఉంటున్న ఇంటి నుంచి అతన్ని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, స్థానిక పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు, అసెంబ్లీ, విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు వందల సంఖ్యలో బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
నిందితుడు లూయిస్ బెంగుళూరుకు చెందిన వ్యక్తి. అతను పీజీ విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం అతను నిరుద్యోగి. అతని తల్లి ఓ రిటైర్డ్ ఉద్యోగి. ఆమెతో కలిసి అతను జీవిస్తున్నాడు. నిందితుడు మానసికంగా వత్తిడిలో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 1100 బెదిరింపు మెసేజ్‌లు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈమెయిల్స్‌తో పాటు ఇతర కమ్యునికేషన్ పద్ధతుల్లో ఆ మెసేజ్‌లు చేసినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. బాంబు బెదిరింపుల ఘటనలో.. పలు రాష్ట్రాలు అనేక కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
శ్రీనివాస్‌కు చెందిన మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన సైబర్ పోలీసుల బృందం రెండు వారాల పాటు దర్యాప్తు చేపట్టింది. డిజిటల్ ఆధారాలతో నిందితుడిని ట్రాక్ చేశారు. మెయిల్స్ కోసం శ్రీనివాస్ పలు రకాల పద్ధతులను వాడినట్లు పోలీసులు గుర్తించారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా కొన్ని మెసేజ్‌లను పంపినట్లు పసికట్టారు. వీపిన్ ద్వారా మెయిళ్లు పంపిన వ్యక్తి ఐడెంటిటీ గుర్తించడం వీలు కాదు. వీపీఎన్ మెయిళ్లకు చెందిన ఓ మొబైల్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ నెంబర్ యాక్టివ్‌గా లేకున్నా.. టెక్నికల్ నిఘా, స్థానిక పోలీసుల సహాకారంతో నిందితుడి అడ్రెస్ కనుగొన్నట్లు చెప్పారు. మైసూరులోని వృందావనం లేఅవుట్లో అతను ఉన్నట్లు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

