ముంబై: క్రికెటర్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఓ ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. సుమారు 1.7 కోట్ల ఖరీదైన మెర్సిడీజ్ బెంజ్ వీ క్లాస్ కారును బహుమతిగా అందజేశాడు. స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తన లగ్జరీ లైఫ్ స్టయిల్‌తో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే 12 కోట్ల ఖరీదైన ఆల్ట్రా లగ్జరీ ఫెరారీ కారును పాండ్యా సొంతం చేసుకున్నాడు. అయితే స్వల్ప గ్యాప్‌లోనే మళ్లీ గర్ల్‌ఫ్రెండ్ మహికాను సర్ప్రైజ్ చేశాడు. గిఫ్ట్ ఇచ్చిన కారుతో పాండ్యా-మహికా దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్‌కు అతని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆదివారం ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సారథ్యంలోని ముంబై జట్టు ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతాపై విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.
Hardik Pandya gifted India’s first Mercedes-Benz V-Class to his girlfriend Mahieka sharma today, and its price is around ₹1.7 crore.🫡 pic.twitter.com/JXdn6dD5Jk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 29, 2026