MLA kotha prabhakarreddy | రాయపోల్, ఆగస్టు 28 : గత రెండు రోజుల నుండి విస్తృతంగా వర్షాలు పడడంతో దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి దొమ్మాట గాజులపల్లి గ్రామాల చెరువులను, రోడ్లను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. వాగులు వంకలు చెరువులు అలుగులు పోవడంతో రోడ్లపై నుండి వర్షం నీరు పోవడంతో రోడ్లన్నీ ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచి పోవడంతో వాటిని పరిశీలించారు.
పర్యటన సందర్భంగా రాయపోల్‌లో యూరియా కోసం రైతులు బారులు తీరడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వైపు అకాల వర్షాలు, మరోవైపు యూరియా కొరత మూలంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షంలో కూడా రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారంటే ఏ స్థాయిలో సమస్య ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే స్పందించి అవసరమైన మేర యూరియాను అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రహిమోద్దిన్, దొమ్మాట మాజీ సర్పంచులు పూజిత వెంకట్ రెడ్డి, మోహన్ రావు, రాయపోల్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, రాష్ట్ర యువజన నాయకుడు రాజిరెడ్డి, నాయకుడు మురళీ, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Cybercrime | సైబర్ వలలో ఆలయ ఉద్యోగి.. లక్షల్లో మోసపోయిన బాధితుడు
Clay Ganesh | కండ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 54 నిమిషాల్లో గణనాథుని విగ్రహం తయారీ
Kamareddy Rains | రెస్క్యూ టీంను పంపించండి సార్.. కామారెడ్డి కాలనీల్లో వరద ముంపు బాధితుల ఆర్తనాదాలు
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త