Clay Ganesh | జహీరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా పూజలందుకునేందుకు గణనాథులు సిద్ధమయ్యారు. విఘ్నేశ్వరుడు రకరకాల రూపాల్లో కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకోనున్నాడు. కాగా వినాయక చవితిని పురస్కరించుకుని ప్రముఖ శిల్పాకారుడు డాక్టర్ హోతి బసవరాజ్ అద్భుతమైన కళతో నిమిషాల్లో గణనాథుడిని తయారు చేశాడు. అది కూడా కండ్లకు గంతలు కట్టుకుని గణేశుడిని తయారు చేయడం విశేషం.
కండ్లకు గంతలు కట్టుకుని విగ్రహం తయారీ అనేది “బ్రహ్మపరివర్తన” వేడుకలో ఒక భాగం. ఇందులో జగన్నాథుడి విగ్రహంలోని అంతర్గత బ్రహ్మ పదార్థాన్ని మార్చేటప్పుడు, పూజారి కళ్లకు గంతలు కట్టుకుని చేతికి వస్త్రం చుట్టుకుని ఆ పని చేస్తారు. విగ్రహం తయారుచేసే వారి నైపుణ్యం లేదా ఒక కళారూపంలో భాగమైనప్పటికీ, విగ్రహం తయారీకి కండ్లకు గంతలు కట్టుకుని చేయడం సాధారణ పద్ధతి కాదు. అలాంటిది సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన న్యాల్కల్కు చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ కండ్లకు గంతలు కట్టుకొని 54 నిమిషాల్లో శ్రీ గణనాథుని ప్రతిరూపాన్ని మట్టితో తయారు చేసి ఔరా అనిపించారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా కండ్లు మూసినా కండ్లు తెరిచినా ఆ గణనాథ ప్రతిరూపం మన మదిలో ఉంటుంది అని ఆయన మరోసారి రుజువు చేశారు. బుధవారం హైదరాబాద్ లోని కుషాయిగూడ చక్రిపురంలోని శిల్పకళ వర్క్ షాప్లో మూడు అడుగుల మట్టి గణనాథుని ప్రతిరూపాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళ అనేది కేవలము చేతివృత్తి కాదు.. అది భక్తి, మంచి భావాలు కలగలిసిన సమ్మేళనం.. మనసుకు హత్తుకపోయే అద్భుతం, ఉత్తేజపరచుటలో శిల్పకళ ఒక అద్భుతం అని శిల్పి అన్నారు.
నేటి యువతీ యువకులకు, పిల్లలకు, పెద్దలకు వారి వారి వృత్తులలో విమజ్ఞులై ఒత్తిడిలకు గురి అవుతున్న వారికి కళను అభ్యసించిన, కలను ఆస్వాదించిన వారు ఒత్తిడి నుండి విముక్తులైతారన్నారు. ఇది కళ అద్భుతం. గతంలో తయారుచేసిన పసుపు గణపతికి వరల్డ్ రికార్డు చోటు చేసుకుందన్నారు. పర్యావరణ హితం కోసం, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ సూచించారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం