చెన్నై: తమిళనాడులో గవర్నర్ (Tamil Nadu Governor) చేతుల మీదుగా పట్టా అందుకోవడానికి యువతి నిరాకరించిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. ఈ నెల 13న తిరునల్వేలిలో మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చాన్స్లర్ హోదాలో హాజరైన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. ఒక్కో విద్యార్థికి డిగ్రీ పట్టా అందజేస్తున్నారు. అయితే ఎంబీఏ విద్యార్థిని జీన్ రాజన్ మాత్రం గవర్నర్ నుంచి పట్టా తీసుకోవడానికి నిరాకరించింది. పక్కన ఉన్న వర్సటీ వీసీ నుంచి సర్టిఫికెట్ స్వకరించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ నేత అన్నామలై (Annamalai) చేతుల మీదుగా మెడల్ అందుకోవడానికి ఓ ఆటగాడు నిరాకరించాడు.
ఇటీవల జరిగిన 51వ రాష్ట్రస్థాయి షూటింగ్ గేమ్స్ జరిగాయి. ఇందులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజన్ కుమారుడు సూర్య రాజ బాలు పతకం గెలుపొందారు. ఈ అవార్డుల ప్రదానోత్స కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు మెడల్స్ బహూకరించారు. అయితే సూర్య మెడలో అన్నామలై పతకం వేయబోతుండగా పక్కకు తప్పుకున్నాడు. చేతితో దానిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Annamalai is a former IPS Officer. This is very disrespectful
DMK Minister’s son
— Hari (@Harii33) August 25, 2025