Swiggy Snacc | ‘స్నాక్’ యాప్ మూసేసిన స్విగ్గీ.. లాభాలు లేకపోవడంతో ఏడాదికే క్లోజ్
Swiggy Snacc : ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ యాప్ తన ‘స్నాక్’ యాప్ సేవల్ని నిలిపివేసింది. గురువారం నుంచి ఈ యాప్ మూసి వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. యాప్ ప్రారంభమైన ఏడాదికే ఇది క్లోజ్ అవ్వడం గమనార్హం.
Swiggy Snacc : ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ యాప్ తన ‘స్నాక్’ యాప్ సేవల్ని నిలిపివేసింది. గురువారం నుంచి ఈ యాప్ మూసి వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. యాప్ ప్రారంభమైన ఏడాదికే ఇది క్లోజ్ అవ్వడం గమనార్హం. లాస్ట్ మినట్ ఫుడ్ డెలివరీ యాప్‌గా ఇది ప్రారంభమైంది. బెంగళూరు కేంద్రంగా ‘స్నాక్’ యాప్ గత ఏడాది జనవరిలో ప్రారంభమైంది.
స్విగ్గీ సంస్థకు చెందినదే అయినప్పటికీ ఇది స్టాండలోన్ యాప్. 10 నుంచి 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయడం దీన ప్రత్యేకత. స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ కంపెనీకి పోటీగా ఉన్న జెప్టో.. జెప్టో కేఫ్, బ్లింకిట్ సంస్థ బిస్ట్రోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్విగ్గీ కూడా ‘స్నాక్’ పేరుతో వాటికి పోటీగా యాప్ లాంఛ్ చేసింది. స్నాక్స్, బెవరేజెస్, మినీ మీల్స్, డెజర్ట్స్ వంటి ఈజీగా అందివ్వగలిగే ఫుడ్ ఐటమ్స్‌ను ఇది డెలివరీ చేసేది. హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర స్టోర్స్‌కు ఐటమ్స్ సరఫరా చేసే సంస్థల నుంచి ‘స్నాక్’ ఆహారోత్పత్తుల్ని సేకరించి, వినియోగదారులకు చేరవేస్తుండేది. కానీ, ఈ సేవలకు సరైన ఆదరణ లభించలేదు. ఈ ఏడాది కాలంగా అనుకున్నంతగా లక్ష్యాన్ని చేరుకోలేదు.
దీంతో నిర్వహణ, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువ కావడంతో ‘స్నాక్’ యాప్‌ను మూసేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఇతర వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ రోజు నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి. అయితే, తాము మాత్రం ప్రయోగాలు చేయడం ఆపబోమని స్విగ్గీ సంస్థ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

