నెన్నెల : సంపూర్ణ అక్షరాస్యత మండలంగా నెన్నెల మండలం ఉండాలని ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్ హై కోరారు. మంగళవారం నెన్నెల జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యావంతుడు తనవంతుగా కనీసం ఇద్దరు నిరక్షారాస్యులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలన్నారు. అందరు సహకరిస్తేనే ఇది సాధ్యం అవుతుందన్నారు. గ్రామాల వారీగా ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు.
ఉల్లాస్ మండల స్థాయి శిక్షణలో ఉపాధ్యాయులు, ఐకేపీ, సీఆర్పీ, ఏమార్పి లు పట్టుదలతో కృషి చేయాలన్నారు. మండలంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని సూచించారు. డిజిటల్ అక్షరాస్యత కూడా సాధించాలని ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఈ ప్రోగ్రాంని జిపిలలో నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మధుమోహన్, ఏపీఎం త్రయంబక్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామాల సీఏలు, సిఆర్పిలు పాల్గొన్నారు.