టేకులపల్లి, ఫిబ్రవరి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గంగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. టేకులపల్లి మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన కోర్స రాంబాబు (30) లచ్చగూడెం నుండి బైక్పై ఆళ్లపల్లి వెళ్తుండగా గంగారం సమీపంలో ఎదురుగా వస్తున్న ఐస్ క్రీమ్ బండి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బోడు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాంబాబుకు భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.