Kamareddy Rains | కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండంతోపాటు చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుస్తున్న అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద గంట గంటకు పెరుగుతోంది. భారీ వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో వరద ప్రవాహం తీవ్రతరం అవుతుంది. కామారెడ్డి పట్టణ శివారు కాలనీలు జలవలయంలో చిక్కుకున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీ, జి ఆర్ కాలనీ ప్రాంతాల్లో వరద ప్రవాహం నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. భవనాలు మునిగిపోవడంతో అందులో నివాసితులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసుకుంటూ వీడియోలు తీసి పంపుతున్నారు.
రెస్క్యూ టీంను పంపించండి సార్..
వరద ముంపును మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. పక్కన ఉన్న బిల్డింగ్లో మొదటి అంతస్తులోకే నీరు ఉబికి వస్తోంది. మూడో ఇంటిలో ముగ్గురున్నరు సార్.. వారిలో వికలాంగ చిన్నారి ఉంది.. దయజేసి మా పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే ఈ వీడియో చూడండి.. జీఆర్ కాలనీ మొత్తం మునిగిపోయింది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపించి మమ్మల్ని రక్షించండి సార్ అంటూ స్థానికుడు విడుదల చేసిన వీడియో వరద ముంపు ఎలా ఉందో తెలియజేస్తుంది.
జీఆర్ కాలనీలో బాధితుల ఆర్తనాదాలు ..