Collector Manu Chaudhary | ములుగు, ఏప్రిల్ 29 : భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంతో భూసమస్యలకు చెక్ పెట్టవచ్చని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. ఇవాళ కలెక్టర్ ములుగు మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా భూరతి చట్టంలోని వివిధ అంశాలను రైతులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు. భూభారతితో పెండింగ్‌లో ఉన్న సాదాభైనామాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి భూధార్ కార్డును కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.
గ్రామాలలోని రైతులకు భూసమస్యలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ర్ ఆరీఫా, ఏఎంసీ చైర్పర్సన్ విజయ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొడిత్యాల ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి