కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో మే 1వ తేదీన నిర్వహించే మేడేను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు దుబాస్ రాములు, విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం కోటగిరి మండల కేంద్రంలో మేడే వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడి ఎంతోమంది అమరులయ్యారన్నారు.
వారి బలిదానాలకు గుర్తుగా ఎర్రజెండాలను ఎగురవేస్తూ పండుగలా మేడే ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నల్ల గంగాధర్, సాయిలు, నరేందర్, శివ, గంగాధర్, సాయిలు, నజీర్, వాజీద్ తదితరులు ఉన్నారు.