Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి
ఆయనో ఏఎస్ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 29: ఆయనో ఏఎస్ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.
మహేశ్ అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (Sircilla) మున్సిపల్ పరిధిలోని సర్థపూర్లో ఉన్న 17వ పోలీస్ బెటాలియన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో సోమవారం రాత్రి పట్టణంలోని ఓ ఇంట్లో దూరి, చోరీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్నవారికి పట్టుబడ్డాడు. దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

