Gellu Srinivas | తొగుట, సెప్టెంబర్ 1 : కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తొగుట మండలంలోని మల్లన్న సాగర్లో గోదావరి జలాల మధ్య బీఆర్ఎస్వీ శ్రేణులతో కలిసి అపర భగీరథుడు కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమైనట్టు, లక్ష కోట్లు అవినీతి అంటూ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తుందన్నారు. కృంగిన పిల్లర్లను మరమ్మత్తు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే.. రేవంత్ సర్కార్ కుట్ర పూరితంగా రిపేర్ మరిచి తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన నేరమా..? అని ఆయన ప్రశ్నించారు. 20 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేయాల్సింది పోయి కాళేశ్వరం కమిషన్ పేరు మీద కేసీఆర్ మీద విష ప్రచారం చేస్తున్నారన్నారు.
తెలంగాణను సస్యశ్యామలం చేసి..
బంగాళాఖాతంలో వృధాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి, ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ నీళ్లు అందించారన్నారు. కరువు కాలంలో ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేసి భారతదేశంలోనే నెంబర్ 1 చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.. యూరియా కోసం తెలంగాణ రైతాంగం తల్లడిల్లుతుంటే అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది పోయి, కాళేశ్వరం కమిషన్ పుస్తకం ముంగటేసుకోవడం భావ్యమా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ సీబీఐ జపం చేస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు కాపాడుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్వీ ఇన్చార్జ్ సురేష్ గౌడ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, మండల యూత్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, నంట పరమేశ్వర్ రెడ్డి, యూత్ నాయకులు చిలువేరి మల్లారెడ్డి, దోమల కొమురయ్య, వేల్పుల స్వామి, తీపిరెడ్డి మహేష్ రెడ్డి, అనిల్, యూత్ నాయకులు అనిల్ కుమార్, చింతా బైరా రెడ్డి, భైరాగౌడ్, బాలరాజు, ప్రశాంత్, హైమ్మద్, అరవింద్, NY యాదవ్, సురేష్ గౌడ్,రాజు, శ్రీనివాస్,రాంబాబు,శ్రీకాంత్, సాయికిరణ్ రేడ్డి, తరుణ్, స్వామి, అశోక్ కర్ణాకర్, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్, ప్రశాంత్, సంతోష్, అరవింద్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
BRS | కేసీఆర్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
Lakshmi Devipalli | బావోజి తండాలో తాగు నీటి సమస్యను పరిష్కరించండి
Karepalli | ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి క్రాస్ రోడ్ యువత.. ఆపద సమయంలో అండగా నిలుస్తున్న యువకులు