ఇల్లెందు : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇల్లెందులో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ జీవ ప్రధాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ఎస్ ఎంతో శ్రమించారన్నారు.
తెలంగాణ ప్రజలకు సాగునీటి సౌకర్యం కల్పించిన కేసీఆర్పై అసెంబ్లీలో కుట్రపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, అబ్దుల్ జబ్బార్, సన్న రాజేష్, లలిత్ పాసి, మునిగంటి శివ, వసంతరావు, రామ్ లాల్ పాసి, డేరంగుల పోషం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.