లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బావోజి తండా గ్రామపంచాయతీలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో ఉన్న చేతి పంపు నుండి మురికి నీరు రావడంతో గ్రామస్తుల మంచి నీళ్ల కోసం మైళ్లదూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ఇదే విషయంపై గ్రామ సెక్రటరీకి పరువుమార్లు చెప్పిన కూడా పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలంలో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమస్యపై ఉన్నంత అధికారులు తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.