Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ జట్టు బస్సులో చెలరేగిన మంటలు.. అర్ధరాత్రి గంటసేపు రోడ్డుపైనే ప్లేయర్లు!
Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం.. వారు వెళ్తున్న బస్సులో అకస్మా్తుగా మంటలు చెలరేగాయి.
Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం.. వారు వెళ్తున్న బస్సులో అకస్మా్తుగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను సురక్షితంగా బయటకు దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ జట్టు హోటల్‌కు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన కారణంగా ఆటగాళ్లు దాదాపు గంటసేపు రోడ్డుపైనే ఉండిపోయినట్లు సమాచారం. అనంతరం మరో బస్సులో తాము బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు.
ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.తొలుత రసిఖ్ సలామ్ దార్ (3/27), భువనేశ్వర్ (2/29), హేజిల్‌వుడ్ (2/37) బుల్లెట్లలాంటి బంతులు వేయడంతో గుజరాత్ 20 ఓవర్లలో 155/8 స్కోరు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఫిఫ్టీతో పోరాడాడు. అనంతరం కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్) ముందుండి నడిపించడంతో చిన్న లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

