Pushpa 3 | పుష్ప 3’పై క్రేజీ అప్డేట్.. జగపతి బాబు రోల్ పెరుగుతుందా, సల్మాన్ ఖాన్ ఎంట్రీ నిజమేనా?
Pushpa 3 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. మొదటి భాగం ఘనవిజయం సాధించగా, రెండో భాగం ‘పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Pushpa 3 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. మొదటి భాగం ఘనవిజయం సాధించగా, రెండో భాగం ‘పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల జపాన్‌లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో అక్కడి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ‘పుష్ప 3’పై పడింది.
మూడో భాగం ఎప్పుడు ప్రారంభమవుతుంది? కథ ఎలా ఉండబోతోంది? కొత్త పాత్రలు ఏమైనా చేరతాయా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతి బాబు, ‘పుష్ప 3’పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చాలా మంది ఊహిస్తున్న దానికంటే త్వరగానే మూడో భాగం పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాగే దర్శకుడు సుకుమార్ తన పాత్రకు మూడో భాగంలో మరింత ప్రాధాన్యం ఉంటుందని చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ‘పుష్ప 3’లో జగపతి బాబు పాత్ర కథను మలుపుతిప్పే స్థాయిలో ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక మరోవైపు ‘పుష్ప 3’లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించనున్నారనే వార్తలు కూడా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్రాంచైజీని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఒక ప్రత్యేక మాస్ క్యామియో పాత్ర కోసం సల్మాన్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అయితే ‘పుష్ప 3’ విడుదలకు ఇంకా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వాల్లో కూడా సినిమాలు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ఆయన పూర్తిస్థాయిలో ‘పుష్ప 3’పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఫహద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర, జగపతి బాబు పాత్ర చుట్టూ ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. మూడో భాగంలో వీటి చుట్టూనే ప్రధాన కథ నడిచే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

