Gudumba | హుస్నాబాద్ టౌన్, మే 18 : గుడుంబా తయారీ కోసం తీసుకువస్తున్న బెల్లం, పట్టిక లారీని ఎక్సైజ్‌పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని కేడ్గవా నుంచి హుస్నాబాద్‌కు వస్తున్న లారీని శనివారం సాయంత్రం పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపారు. ఈ లారీలో ఎనిమిది వేల కిలోల బెల్లం, 200 కిలోల పట్టికను గుడుంబా తయారీకొరకు తరలిస్తున్నట్లు సీఐ పవన్ తెలిపారు.
పట్టణంలోని కవిత ట్రేడర్స్‌కు చెందిన వెంకటేశ్‌తోపాటు హుజురాబాద్, కరీంనగర్‌లకు చెందిన వ్యాపారుల కొరకు ఈ బెల్లం, పట్టికను తరలిస్తున్నట్లు లారీడ్రైవర్ వివరించినట్లు సీఐ చెప్పారు. బెల్లం, పట్టికను తరలిస్తున్న డ్రైవర్‌తోపాటు వ్యాపారులపై సైతం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ పవన్ తెలిపారు.
ఈ లారీని పట్టుకునే విషయంలో ప్రత్యేకంగా కృషిచేసిన కానిస్టేబుల్ రాజును అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముర్ఫి, సీఐ పవన్‌లు అభినందించారు. టీంలో ఎక్సైజ్ ఎస్ఐ రూప, సిబ్బంది రాజమల్లారెడ్డి, ఖలీక్, రాజు, సతీశ్ తదితరులు ఉన్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్