Harish Rao | కాళేశ్వరం జలాల కోసం అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏదేమైనా రేవంత్ రెడ్డి కండ్లు తెరవాల్సింది ఒక్కటే.. ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు, ఇది అచ్చంగా మా చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్ర అని అన్నారు.
ఇప్పటికైనా కళ్లు తెరువు రేవంత్. రేవంత్ రెడ్డి నువ్వు కళ్లు తెరవకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుదేరుతయి. లేకుంటే యావత్ తెలంగాణ రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ తెచ్చిన కరువు అన్నారు. పోయిన ఆరేండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన ఆరేండ్లు.. మీరు ఫోన్ చేసుడు.. కాలువ గేట్లు ఎత్తుడు. మీ ఊర్లళ్ల పొలాలళ్లకు నీళ్లు వచ్చుడు. మీ చెరువులు ఎండాకాలంలోఅలుగులు దుంకినయ్. మత్తుళ్లు దుంకిన చెరువులు చూసుకున్నం. బ్రహ్మాండంగా రెండు పంటలు కూడా పండించుకొని బతికినం. కానీ రేవంత్ రెడ్డి పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు.. కేసీఆర్కు మంచి పేరొచ్చిందని కాళేశ్వరం కటక ఒత్తుతలేడని మండిపడ్డారు. ఆనాడు కాళేశ్వరంతో రంగనాయక సాగర్ నింపుకుని ఎండాకాలంలో కూడా పొలాల్లోకి నీళ్లు తెచ్చుకున్నాం.
నేడు రేవంత్ రెడ్డి పగతో, ప్రతీకారంతో కాళేశ్వరం కటక ఒత్తుతలేడని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ను తిడితే నీళ్లు రావు, కటక ఒత్తితేనే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి అని హితవు పలికారు.
Live: కాళేశ్వరం జలాల కోసం అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/zwl0kr20eN
— BRS Party (@BRSparty) July 19, 2026
Read ALso :
Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర
Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్పై నుంచి కిందపడి నవ వధువు మృతి