MID Day Meal | తొగుట, జూలై 15 : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ ఉపాధ్యాయులకు కాకుండా ఇతరులకు అప్పగించాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం పథకం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇతరులకు అప్పగించి ఉపాధ్యాయులకు భారాన్ని తగ్గించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లు రాకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికులకు బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాములు, బాలరాజు, మల్లేశం, శ్రీనివాస్, శ్రీధర్, శ్రీనివాస్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి