మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress leader) జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సోమవారం రాత్రి మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకున్నది. పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న అనిల్.. సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో చిన్నఘనపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద అదుపుతప్పిన కారు కల్వర్టుకు ఢీకొట్టింది. అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన వాహనదారులు ఆయనను మెదక్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.చికిత్స పొందుతూ మరణించారు.
అయితే పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా బుల్లెట్ల లభించాయి. అతని కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఎవరైనా హత్య చేశారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం అనిల్ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.