కారేపల్లి, మార్చి 04 : గ్రామాలలో సంఘాల బలోపేతం, మహిళల అర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సమాఖ్య సహాయకుల(వీఓఏ)కు పనికి తగిన ప్రతిఫలం దక్కటం లేదని వీఓఏల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి వసంత, ఈసం నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. బుదవారం కారేపల్లిలో సింగరేణి మండల వీఓఏలు కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సంఘం ద్వారా వీఓఏల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సెర్ప్ ప్రాజెక్టు ద్వారా ఇచ్చే ఆదేశాలను వెంటనే అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు.
వీఓఏలకు ప్రభుత్వమే పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షురాలిగా బొడ్డుపల్లి వసంత, కార్యదర్శిగా ఈసం నాగమణి, కోశాధికారిగా చీకూర్తి సుజాతను ఎన్నుకున్నారు. అనంతరం సంఘ బాధ్యులు సింగరేణి మండల ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లుకు వినతి ప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకురాళ్లు పి.మమత, బి.సింధుజ, వై.కళ్యాణి, పి.రమాదేవి, జి.మోహన్, టి.లలిత, కె.వెంకటేశ్వర్లు, కె.మంగతాయి, ఎన్.అనూష, సీహెచ్. లక్ష్మి. పి.బాలకృష్ణ పాల్గొన్నారు.