Farmers | రాయపోల్, ఆగస్టు 23 : అన్నదాతలకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. యూరియా కొనుగోలు చేసేందుకు రైతన్నలు పడుతున్న గోస ప్రభుత్వానికి పట్టడం లేదు. యూరియా కోసం ఒక రోజు ముందుగా కూపన్లు ఇవ్వడం.. మరో రోజు యారియా ఇవ్వడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం యూరియా కోసం రైతులకు టోకెన్లు ఇచ్చారు. యూరియా రాకపోవడంతో శనివారం సొసైటీ ముందు టోకెన్లు పంపిణీ చేశారు.
కాగా రైతు వేదిక నుంచి సొసైటీ వరకు రావాలంటే కిలోమీటర్ దూరం ఉందని.. అధికారులు తమను ముప్పు తిప్పలు పెడుతున్నారని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు సొసైటీ వద్ద టోకెన్లు ఇస్తే తమకు ఇంత ఇబ్బంది ఉండేది కాదని.. రైతులకు అవసరమయ్యే యూరియా కూడా ఇవ్వడం లేదని..ఒకరికి ఒక బస్తా యూరియాను అందించడంతో తాము ఎలా వ్యవసాయం చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పడుతున్న అవస్థలు చూసి అధికారులు కనికరం చూపడం లేదని ఆవేదన చేందుతున్నారు.
దౌల్తాబాద్ మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా.. అందుకు అనుగుణంగా సాగు చేసిన వ్యవసాయ పంటలకు యూరియాను అందించడంలో అధికారులు ముందస్తుగా ప్రణాళికలు చేయకపోవడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం యూరియా కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ.. మరోపక్క ఒక రైతుకు ఒక బస్తా యూరియా ఇవ్వడంతో రైతులు ఆగమవుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియాను అందించాలని మండల దౌల్తాబాద్ మండల రైతులు కోరుతున్నారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో