Farmers | రాయపోల్, జూన్ 16 : నైరుతి రుతుపవనాలు వస్తాయని భావించిన రైతాంగం ముందస్తుగా వివిధ పంటలను సాగు చేశారు. ఇందులో భాగంగానే పత్తి, మొక్కజొన్న పంటలను రైతులు ముందస్తుగా వేశారు. అయితే వర్షాలు విస్తారంగా కురుస్తాయని భావించిన రైతులు వర్షాలు లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి రైతులు ముందస్తు విత్తనాలు నాటారు. ప్రతీ రోజు వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.
నీటి వనరులు ఉన్న రైతులు డ్రిప్పు, స్పింకర్ల ద్వారా పంటలను దక్కించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నీటి దరువు లేని రైతులు వర్షాలపైనే ఆధారపడి ప్రతి నిత్యం వర్షం కురుస్తుందని ఆశతో ఉన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో అధిక శాతం పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తూ వస్తున్నారు. అయితే వర్షాలు ముందస్తుగా మురిపించడంతో విత్తనాలు వేసిన రైతులు… ఇప్పటివరకు విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే వేసిన పంటలు మొలకెత్తుతాయని రైతులు ఎంతో ఆశాభావంతో ఉన్నారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురువాలని రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురవకపోతే పెట్టిన పెట్టుబడులు రావని.. మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందని.. దీంతో రైతులకు మరింత భారంగా మారుతుందని వివిధ గ్రామాల రైతులు వాపోయారు. రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయో లేదో వేచి చూడాల్సిందే.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత