నర్సింహులపేట, జూన్ 16 : మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యకారుడు, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఎండీ ఖాజామియా సతీమణి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆర్థికసాయం అందించారు. మండల అధ్యక్షుడు మైదం దేవేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రూ.21వేలు, మసీదు కమిటీ రూ.17 వేలు, దేవస్థాన మాజీ చైర్మన్ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో మరికొందరు రూ.9వేలు అందించారు. అలాగే పలు సంఘాల నాయకులు ఖాజామియాకు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్, గుగులోతు రవి, అజ్మీరా హోళీ, లింగ్యానాయక్, వీరన్న తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Neem Leaves | వేపాకులను రోజూ పరగడుపునే తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
Bomb Threats | జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం వెనక్కి మళ్లింపు